తిరుమల శ్రీవారిని తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లిన నితీశ్ కుమార్.. మోకాళ్లపై మెట్లు ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టేశాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన ఆయన.. మెల్‌బోర్న్ టెస్టులో జట్టును ఫాల్ ఆన్ గండం నుంచి బయటపడేశాడు.