టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌కు ఓ ఎంపీతో నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్. దీంతో చాలా మంది ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే నిశ్చితార్థంపై అటు రింకూ గానీ.. ఇటు ప్రియా సరోజ్‌గానీ అధికారికంగా స్పందించలేదు.