తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బాలన్ అనే వ్యక్తి తన తల్లి శివగామి మృతదేహాన్ని సైకిల్‌పై 15 కి. మీ తీసుకెళ్లడం అందరితో కన్నీళ్లు పెట్టించింది. నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. ఆమె మరణించిన తరువాత తల్లి మృతదేహాన్ని సైకిల్‌పై జాగ్రత్తగా తీసుకెళుతున్న దృశ్యం చూపరుల హృదయాలను కలచివేసింది.