Saturday, February 15, 2025

మీకు పీడ కలలు వస్తున్నాయా..?

Must Read

చాలా మందికి నిద్ర పోయినప్పుడు కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు పీడ కలలు వస్తుంటాయి. దెయ్యాలు వెంటపడినట్టు అనిపించడం పడిపోయినట్టు అనిపించడం ఎక్కడో చిక్కుకుపోయినట్లు ఇలా భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కొంత మందికి చెమటలు కూడా పట్టేస్తుంటాయి. పైగా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఒత్తిడి ఆందోళన ఎక్కువవుతుంది. అయితే, ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా పీడ కలలే రాకూడదంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. వాటిని తీసుకుంటే పీడ కలలు రావు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

రాత్రి పీడ కలలు రాకూడదంటే పడుకునే ముందు ఒక కప్పు చామంతి టీ ని కానీ లేవండర్ టీ ని తాగండి. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పీడకలల బాధ ఉండదు. పాలు, పెరుగు, జున్ను ఇలా కాల్షియం ఉండే వాటిని తీసుకుంటే కూడా పీడ కలలు ఎక్కువగా రావు. బచ్చలి కూర, ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా పీడ కలలు రాకుండా చేస్తాయి.

కాలీఫ్లవర్ తీసుకుంటే కూడా పీడ కలలు రావు. చేపలు, గుడ్లు, మొలకెత్తిన విత్తనాలు, సీ ఫుడ్ వంటి వాటిని తీసుకుంటే కూడా మంచిగా నిద్ర పట్టి పీడ కలలు రావు. బ్రౌన్ రైస్, చిలగడ దుంపలు వంటి పిండి పదార్థాలు కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా చక్కగా నిద్రపోవడానికి సహాయపడతాయి. అరటి పండ్లు పౌల్ట్రీ తృణధాన్యాలు కూడా తీసుకోవచ్చు. ఇలా వీటితో పీడ కలలే లేకుండా హాయిగా నిద్రపోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -