Friday, September 20, 2024

ఈ గ్లాసెస్‌తో ప్రతిదాన్ని లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు!

Meta CEO Mark Zuckerberg unveils redesigned Ray-Ban Meta smart glasses that can live stream to Facebook and Instagram.

Must Read

ఇప్పుడు మనందరం టెక్ వరల్డ్ లో ఉన్నాం. మునుపటితో పోల్చుకుంటే సాంకేతికతలో ఇప్పుడు చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ప్రతి ఏటా ఓ కొత్త టెక్నాలజీ పరిచయం అవుతోంది. టెక్ దునియాలో గత కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీని లాంచ్ చేసినప్పటి నుంచి అందరి దృష్టి దీని వైపు మళ్లింది. చాట్ జీపీటీ పనితీరుకు ఎవ్వరైనా సరే.. ఫిదా అవ్వక తప్పదు. మానవ మేధ, సామర్థ్యానికి దీటుగా ఏఐ చాట్ బాట్ ప్రతిస్పందన ఉండటంతో తక్కువ టైమ్లోనే ఏఐ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ టెక్నాలజీలో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా కంపెనీలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఈ రేసులో మరో దిగ్గజ సంస్థ మెటా మాత్రం వెనుకబడింది.

మిగతా కాంపిటీటర్లకు భిన్నంగా సొంతంగా ఏఐ అసిస్టెంట్ ను డిజైన్ చేయడంపై మెటా ఫోకస్ పెట్టింది. దీని పేరు మెటా ఏఐ. దీని సాయంతో నయా ప్రాడక్ట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మెటా ఏఐ అసిస్టెంట్ ఫీచర్ కలిగిన స్మార్ట్ గ్లాసెస్ ను ఇంట్రడ్యూస్ చేసింది. వీటిని రేబాన్-మెటా స్మార్ట్ గ్లాసెస్ పేరుతో రిలీజ్ చేసింది. ఈ గ్లాసెస్ తయారీ కోసం ఎస్సిలార్ లుక్సోటికా కంపెనీతో కలసి పనిచేశామని మెటా వెల్లడించింది. ఏఐ అసిస్టెన్స్ సాయంతో నడిచే రేబాన్-మెటా స్మార్ట్ గ్లాస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెటా సంస్థ నుంచి వచ్చిన తొలి స్మార్ట్ గ్లాసెస్ ఇవే కావడం విశేషం. ఈ గ్లాసెస్ చాలా తేలిగ్గా, సౌకర్యవంతంగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. వీటిని నెక్స్ట్ జనరేషన్ గ్లాసెస్ గా అభివర్ణిస్తోంది.

వీడియోలు రికార్డింగ్

రెబాన్-మెటా స్మార్ట్ గ్లాసెస్ లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. వీటిని ధరించి మీరు చూసే ప్రతిదాన్ని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. దీంట్లో ఓ కెమెరా ఉంటుంది. ఆ కెమెరా సాయంతో ఫొటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డు చేయొచ్చు. అలాగే మ్యూజిక్ కూడా ప్లే చేయొచ్చు. ఈ గ్లాసెస్ లో ఉండే మెటా ఏఐ అసిస్టెంట్ ద్వారా వాట్సాప్, మెసెంజర్ లో ఇతరులతో ఇంటరాక్ట్ అవ్వొచ్చు. మెటా ఏఐ సాయాన్ని పొందాలంటే గ్లాసెస్ వేసుకొని ‘హే మెటా’ అంటే సరిపోతుంది. మీ వాయిస్ ద్వారా సంభాషణలు కంటిన్యూ చేయొచ్చు. అలాగే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా పొందొచ్చు.

ధర ఎంతంటే..?

రేబాన్-మెటా స్మార్ట్ గ్లాసెస్ లో 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను వినియోగించారు. దీంట్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ను ఉపయోగించారు. ఈ గ్లాసెస్ తో పాటు ఓ ఛార్జింగ్ కేస్ వస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 36 గంటల వరకు వినియోగించొచ్చు. షైనీ బ్లాక్ కలర్స్ తో పాటు జీన్స్, రెబల్ బ్లాక్, కారామెల్ రంగుల్లో ఈ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయి. దీని ధరను 299 డాలర్లు (భారత కరెన్సీలో సుమారుగా రూ.24,500)గా మెటా నిర్ణయించింది. వీటిని మెటా, రేబాన్ అఫీషియల్ వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ గ్లాసెస్ ను అమెరికాలో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో వరల్డ్ వైడ్ గా తీసుకొస్తామని మెటా తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -