Sunday, October 18, 2026

షిరిడిలో ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసులు మృతి

Must Read

మహారాష్ట్రలోని షిరిడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికుల‌తో వెళ్తున్న తుఫాన్ వాహ‌నం.. అదుపుత‌ప్పి ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలతో పాటు ఆరు నెలల చిన్నారి ఉంది. మృతులంతా తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప వాసులుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దేవుడి దర్శనానికి వెళ్లిన వారు విగతజీవులుగా మారడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -