Tuesday, July 1, 2025

బాలు జ‌యంతి.. జ‌గ‌న్ ట్వీట్

Must Read

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సంగీతానికి ఎన‌లేని సేవ‌లు అందించిన మ‌హా గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌ను స్మ‌రించుకుంటూ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. త‌న గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళులు అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

సంగీత ప్రపంచానికి చిరకాల స్మృతిగా నిలిచిన ఎస్పీ బాల సుబ్ర‌మ‌ణ్యం 2020 సెప్టెంబ‌ర్ 25న 74 ఏళ్ల వయస్సులో చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయ‌న 1966లో తెలుగు సినిమా ‘శ్రీ శ్రీ శ్రీ మ‌ర్యాద రామ‌న్న’ చిత్రంతో పాటల ప్రస్థానం ప్రారంభించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మ‌ల‌యాళం సహా 16 భాష‌ల్లో 40,000కు పైగా పాట‌లు పాడి, ‘పాడుం నీల’ (గాయ‌నీ చంద్రుడు) అని పిలువబడేలా చేశారు.ఆయ‌న సేవలను గుర్తిస్తూ, తమిళనాడులోని తిరువ‌ళ్లూరు జిల్లాలో ఒక స్మార‌కం, మ్యూజియం నిర్మించేందుకు ప్రణాళిక‌లు రూపొందించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -