Friday, August 29, 2025

జ‌వాన్ ముర‌ళీకి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

Must Read

భార‌త సైన్యంపై పాకిస్థాన్ జ‌రిపిన కాల్ప‌ల్లో వీర మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్‌కు వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నివాళి అర్పించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఓ పోస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఇండియా-పాకిస్తాన్ యుద్ధభూమిలో సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ వీర మ‌ర‌ణం తీవ్ర బాధ కలిగించింది. దేశం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఈ దుఃఖ సమయంలో మేము వారితో పాటు నిలుస్తాము.. అని ఆయ‌న పోస్టులో పేర్కొన్నారు.మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్‌లో పరామర్శించారు. ఎల్ల‌వేళ‌లా త‌మ‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా క‌ల్పించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -