Friday, August 29, 2025

ఆప‌రేష‌న్ సింధూర్‌పై ట్రంప్ కామెంట్స్

Must Read

పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త్ జ‌రుపుతున్న ఆప‌రేష‌న్ సింధూర్ ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై ప‌లు దేశాలు స్పందిస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాల‌ని సూచించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితిలు చాలా దారుణంగా ఉన్నాయ‌ని, భారత్, పాక్‌లు దశాబ్దాలుగా గొడవ పడుతున్నాయ‌ని పేర్కొన్నారు. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోర‌న్నారు. ప్రపంచానికి శాంతి కావాల‌ని, ఘర్షణలు వద్దని చెప్పారు. మ‌రోవైపు ఆపరేషన్ సింధూర్‌పై ఇజ్రాయిల్ ఇండియాకు మద్దతు తెలిపింది. అమాయకులపై దాడికి పాల్పడే ఉగ్రవాదులకు జీవించే హక్కు లేద‌ని, ఇండియాకు ఆత్మ రక్షణ హక్కు ఉందని ఇజ్రాయిల్ అంబాసిడర్ ర్యూవెన్ అజర్ ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -