Wednesday, July 2, 2025

పాక్‌-భార‌త్ గొడ‌వ‌లు ఆపండి – ట్రంప్

Must Read

భారత్, పాకిస్తాన్ దాడులపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి స్పందించారు. రెండు దేశాలు టిట్ ఫర్ టాట్‌ లాగా చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించుకొని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నాన‌ని చెప్పారు. రెండు దేశాలతో త‌న‌కు మంచి సత్సంబంధాలు ఉన్నాయ‌ని, ఈ గొడవలు ఆపుతారంటే త‌న‌కు చేతనైన సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాగా, పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ పైనా ట్రంప్ స్పందించారు. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోర‌ని, ప్రపంచానికి శాంతి కావాల‌ని, ఘర్షణలు వద్దని ట్రంప్ సూచించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -