తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు ఈనెల 30 నుండి నిరవధిక సమ్మె ప్రకటించారు. జనవరి నెల నుంచి తమకు ఇవ్వాల్సిన స్టైపెండ్ చెల్లించాలని, నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈనెల 30 నుండి నిరవధిక సమ్మె చేస్తామని, అత్యవసర సేవలు మినహాయించి అన్ని సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించింది.