Thursday, January 15, 2026

కశ్మీర్‌లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య

Must Read

క‌శ్మీర్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్‌లో చేరిన తెలంగాణకు చెందిన జ‌వాన్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు (28) 2016 లో బీఎస్ఎఫ్ లో చేరాడు. మూడేళ్లుగా కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పని చేస్తున్నాడు. మానసిక ఒత్తిడి కారణంగా మూడు రోజుల కిందట తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, మంగళవారం నాగ‌రాజు మృత‌దేహాన్ని స్వ‌గ్రామానికి తీసుకొచ్చారు. నాగ‌రాజు కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు గ్రామ‌స్తులంతా గుండెలు బాదుకుంటూ క‌న్నీరు పెట్టుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -