Saturday, August 30, 2025

ఫార్లీ ఫిరాయింపుల‌పై సుప్రీం కీల‌క‌ తీర్పు

Must Read

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. ఈ తీర్పులో భాగంగా, అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం స్వయంగా ఎమ్మెల్యేలపై వేటు వేయాలని చేసిన పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరించింది. “ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్ అన్న సూత్రం ఇక్కడ వర్తించకూడదు” అంటూ కోర్టు వ్యాఖ్యానిస్తూ, పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్ ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ సహా పలువురు నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించి, తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్‌పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేసిన అంశాన్ని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలలో పి.శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, ఎ.గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్‌లు ఉన్నారు. ఈ ఏడాది జనవరి 15న దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టులో తొమ్మిది సార్లు విచారణకు వచ్చి, ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్‌లోకి వెళ్లింది. సుదీర్ఘ వాదనల అనంతరం గురువారం వెలువడిన ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులపై దిశానిర్దేశం చేసేలా ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫిరాయింపు పిటిషన్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండరాదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, మూడు నెలల్లో స్పీకర్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలు భవిష్యత్తులో రాజకీయ పరిణామాలకు కీలకం కానున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -