Thursday, January 15, 2026

తెలంగాణ‌లో నేటి నుంచి వర్గీకరణ అమలు

Must Read

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమలుకు రానున్నాయి. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజిక రంగ విద్యాపరంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూపు 1 కింద ఒక శాతం, మద్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలకు గ్రూప్ 2 కింద 9%, గణనీయంగా లబ్ధి పొందిన 26 ఉప కులాలను గ్రూప్ 3 కింద 5% రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించింది.సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -