Friday, May 9, 2025

నూతన పోప్‌గా రాబర్ట్ ప్రీవోస్ట్

Must Read

ఇటీవ‌ల‌ పోప్ ఫ్రాన్సిస్ చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం త‌దుప‌రి పోప్ ఎవ‌రు అవుతార‌న్న దానిపై కొద్దిరోజులుగా తీవ్ర చ‌ర్చ న‌డిచింది. కాగా, తీవ్ర ఉత్కంఠ న‌డుమ తొలిసారి అమెరికన్ పోప్‌గా రాబర్ట్ ఫ్రాన్సిస్‌ ప్రీవోస్ట్ ఎన్నిక‌య్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 140 కోట్ల మంది క్యాథలిక్‌ల కొత్త మత గురువుగా ఆయ‌న‌ను ఎన్నుకున్నారు. 69 ఏళ్ల ప్రివోస్ట్‌ పోప్‌ లియో 14 పేరుతో 267వ పోప్‌గా అధికారం చేపట్టనున్నారు. వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ బసిలికాలో సమావేశమైన 133 మంది కార్డినల్స్‌ కొత్త పోప్‌ను ఎన్నుకున్నారు. కొత్త పోప్‌ను ఎన్నుకున్నందుకు సూచనగా సెయింట్‌ పీటర్స్‌ బసిలికాలోని సిస్టైన్‌ చాపెల్‌ నుంచి తెల్లని పొగను వదిలారు. ఆ తర్వాత చర్చిలోని సెంట్రల్‌ బాల్కనీ నుంచి ఫ్రెంచ్‌ కార్డినల్‌ డొమినిక్‌ మంబెర్టీ లాటిన్‌ భాషలో ‘హబెమస్‌ పాపమ్‌’(మనకు కొత్త పోప్‌ వచ్చారు) అని ప్రకటించారు. అనంత‌రం వాటికన్‌లో సంబరాలు మొదలయ్యాయి. షికాగో నగరంలో 1955 సెపె్టంబర్‌ 14న జన్మించిన ప్రివోస్ట్‌.. 2023లోనే కార్డినల్‌గా నియమితులయ్యారు. పోప్‌గా ఎన్నికైన తర్వాత సెయింట్‌ పీటర్స్‌ బసిలికా నుంచి తొలి సందేశమిచ్చిన పోప్‌ లియో 14 ప్రపంచంలోని మనుషులందరినీ కలిపే వారధులు నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

జ‌వాన్ ముర‌ళీకి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

భార‌త సైన్యంపై పాకిస్థాన్ జ‌రిపిన కాల్ప‌ల్లో వీర మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్‌కు వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నివాళి అర్పించారు. ఈ మేర‌కు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -