Tuesday, July 1, 2025

2047కి పోలీసులు సిద్ధంకండి

Must Read

విజన్ 2047కు పోలీసులు సిద్ధం కావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలు గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. విజయవాడకు వచ్చిన వరదల్లో కానీ, తిరుమల బ్రహ్మోత్సవాలు కానీ, ఇంద్రకీలాద్రి పై నవరాత్రులు కానీ, పోలీసులు బాగా పని చేసారని కొనియాడారు. గత ప్రభుత్వంలో జగన్ కక్షసాధింపుల కోసం, ఉన్నతమైన ఐపీఎస్ వ్యవస్థని కూడా వాడుకునే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. జగన్ పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసాడని మండిపడ్డారు. నాటి ముఖ్యమంత్రి రూ.12.85 కోట్లతో తన ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకున్నాడు కానీ, నేరస్థులని పట్టుకునే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ లాంటి వ్యవస్థకు, 5 ఏళ్ళలో రూ.10 కోట్లు ఇవ్వలేక పోయాడని విమర్శించారు. పోలీసుల సంక్షేమం కోసం ఈ ఏడాది నుంచి రూ.20 కోట్లు కూటమి ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. నేరాలు చేస్తే వదిలేది లేదని రౌడీలను హెచ్చరించారు. గత ప్రభుత్వ వారసత్వంగా వచ్చిన గంజాయి, డ్రగ్స్ పెద్ద సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు. నేరస్తులకు ప్రత్యేక కోర్టులు పెట్టి, వెంటనే శిక్షలు పడేలా చేస్తామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -