Friday, December 27, 2024

తెలంగాణలో పోలీస్ V/S పోలీస్!

Must Read

తెలంగాణలో బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యలు ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమతో వెట్టిచాకిరి చేయించడం మానుకోవాలని పేర్కొన్నారు. ఒకే చోట ఐదేండ్లు పోస్టింగ్ ఇచ్చి, కుటుంబానికి సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. ఉన్నతాధికారుల ఇండ్లలో బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై బైఠాయించారు. ఈ క్రమంలో మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డితో వారిని చెదరగొట్టారు. దీంతో ఆమెతో పోలీసు నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. రెండు రోజులుగా ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. హోంశాఖ నేటికీ సీఎం వద్దే ఉందని, అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రేవతి మరణించినట్లు నాకు చెప్పలేదు

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -