Wednesday, November 18, 2026

పల్నాడులో మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్

Must Read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్రోసూరు మండలం నాగవరంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అనంతవరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిని క్రోసూరు పోలీస్ స్టేషన్ నుంచి సత్తెనపల్లికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున అడ్డుకుని నిరసన తెలిపారు.

నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను ఎలా అడ్డుకుంటారంటూ మహిళలు పోలీసులను నిలదీయడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మహిళలపై లాఠీఛార్జ్ చేయగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

క్రీడలపై సీఎం రేవంత్ మాటలు.. హరీశ్ రావు విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల విషయంలో అంతర్జాతీయ స్థాయి మాటలు చెబుతూ క్షేత్రస్థాయిలో క్రీడాకారుల సమస్యలను పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి హరీశ్ రావు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -