Wednesday, November 18, 2026

భారత్ లో తొలి స్వదేశీ బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ ఆవిష్కరణ

Must Read

దేశంలోని కోళ్ల పరిశ్రమను బర్డ్ ఫ్లూ ముప్పు నుంచి రక్షించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హెచ్5ఎన్1 వ్యాక్సిన్ ను నవంబర్ 20వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ నూతన టీకాను జాతికి అంకితం చేయనున్నారు. భోపాల్ నగరంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు దేశీయంగా కోళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న హెచ్5ఎన్1 క్లేడ్ 2.3.2.1a వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకునేలా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు.

గతంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లడంతో పాటు 2006 నుంచి ఇప్పటివరకు 500కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ స్వదేశీ టీకా అందుబాటులోకి రావడం ద్వారా పౌల్ట్రీ రంగం మరియు కోళ్ల పెంపకంపై ఆధారపడిన రైతుల జీవనోపాధికి పూర్తి భరోసా లభించనుంది. కేవలం పక్షులకే కాకుండా జంతువులు మరియు మనుషులకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున వైరస్ ను ప్రాథమిక దశలోనే నివారించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషించనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

క్రీడలపై సీఎం రేవంత్ మాటలు.. హరీశ్ రావు విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల విషయంలో అంతర్జాతీయ స్థాయి మాటలు చెబుతూ క్షేత్రస్థాయిలో క్రీడాకారుల సమస్యలను పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి హరీశ్ రావు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -