Tuesday, October 21, 2025

అల్లు అర్జున్ పై కేసు నమోదు!

Must Read

సినీ నటుడు అల్లు అర్జున్ పై చిక్కడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం పుష్ఫ–2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. ఈక్రమంలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. సదరు మహిళ మూసారంబాగ్ కు చెందిన రేవతిగా గుర్తించారు. ప్రస్తుతం కొడుకు పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఏ1గా సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు పెట్టారు. అల్లు అర్జున్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఏ2గా అల్లు అర్జున్ ను చేర్చారు. ఏ3గా సెక్యూరిటీ మేనేజర్ ను చేర్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -