Monday, December 9, 2024

బీజేపీ ఎమ్మెల్యేలకు మోడీ వార్నింగ్!

Must Read

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఎమ్మెల్యేలను తన ఛాంబర్ కు పిలిపించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ భేటీలో ప్రధాని మోడీ బీజేపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాల వల్లే తెలంగాణలో అధికారంలోకి రావడం లేదని పేర్కొన్నారు. తక్షణమే గ్రూపు రాజకీయాలు ఆపేయాలన్నారు. ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకోవడం నిలిపివేయాలన్నారు. 30 నిమిషాల మీటింగ్ లో 20 నిమిషాలు హెచ్చరికలే జారీ చేశారు. అనంతరం, తెలంగాణ ఎమ్మెల్యేలతో ఫొటోలు దిగారు. వాటిని తెలుగులో రాస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

‘‘తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు అంతేకాక బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు.” అని అన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -