Monday, January 26, 2026

పోలీసులపై మరోసారి పవన్ కళ్యాణ్ ఫైర్!

Must Read

వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల వైఖరిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. మంగళవారం వేమవరంలోని సరస్వతి ప్లాంట్ భూములను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడి యువతని భయపెడితే.. పోలీసులు చూస్తూ ఊరుకున్నారని తెలిపారు. పోలీసులు మెత్తబడ్డారా? లేక భయపడ్డారా? అని ప్రశ్నించారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి రాదని అందుకే పవర్ ప్లాంట్ అని చెప్పారన్నారు. పేదలకు ఇచ్చిన భూములను అన్యాయంగా లాక్కున్నారని ఫైర్ అయ్యారు. భయపెట్టి, బాంబులు వేసి రైతుల భూములు లాక్కున్నారని మండిపడ్డారు. తాము మెతక వైఖరితో లేమని చెప్పేందుకే ఇక్కడికి వచ్చామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -