ఏపీలో రూ.99లకే క్వార్టర్ యువకులను మత్తులో ముంచెత్తుతోంది. మద్యం మత్తులో కొందరు యువకులు దాడులకు దిగుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గాదెంకి టోల్ ప్లాజా కొందరు యువకులు లిక్కర్ తాగి, తాటిబెల్లం కాఫీ షాపుపై దాడి చేశారు. కాఫీ తాగిన అనంతరం యజమాని బిల్లు అడిగినందుకు ఆయనపై దాడి చేశారు. మద్యం మత్తులో కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. సిబ్బందిపైనా దాడి చేశారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు దీపక్, చేతన్, ఉదయ్ గాయపడగా.. దీపక్ పరిస్థితి విషమంగా ఉంది. మద్యం తాగిన వ్యక్తులు పాకాలకు చెందిన పాంట్ర దిలీప్ నాయుడు, మనోజ్, గౌతమ్, దినేశ్ గా పోలీసులు గుర్తించారు.