Monday, January 26, 2026

ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పేల్చి హత్య

Must Read

మైసూరు జిల్లా సలిగ్రామ్ మండలంలో ప్రేమ పేరుతో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. దర్శిత (22) అనే యువతి తన ప్రియుడు సిద్ధరాజు చేతిలోనే దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. కొంతకాలంగా సిద్ధరాజుతో ప్రేమలో ఉన్న దర్శిత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే సాకులు చెబుతూ తప్పించుకున్న సిద్ధరాజు, కుటుంబ పెద్దల ఒత్తిడితో దర్శితను కేరళకు చెందిన సుభాష్‌తో వివాహం జరిపించారు. వీరికి ఒక పాప కూడా పుట్టింది. భర్త దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండటంతో, దర్శిత మళ్లీ సిద్ధరాజుతో సంబంధం కొనసాగించింది. తన కూతురితో కలిసి వస్తానని, భర్తతో ఉండలేకపోతున్నానని పట్టుబట్టడంతో, ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న సిద్ధరాజు దారుణ యత్నానికి పాల్పడ్డాడు. ఒక హోటల్‌కు తీసుకెళ్లి దర్శితను తీవ్రంగా కొట్టి, చివరికి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చేశాడు. దీంతో ఆమె ముఖం చిద్రమై గుర్తుపట్టలేని స్థితిలో మృతి చెందింది. రెండు రోజులుగా కనిపించడం లేదని దర్శిత అత్తింటివారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, హోటల్ సిబ్బంది గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారమిచ్చారు. విచారణలో తొలుత సెల్‌ఫోన్ పేలుడుతో మృతి చెందిందని అబద్ధం చెప్పిన సిద్ధరాజు, చివరకు పోలీసుల దర్యాప్తులో నేరం ఒప్పుకున్నాడు. ప్రస్తుతం సిద్ధరాజును పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -