బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అనారోగ్య సమస్యలతో యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కాగా, ఆయనను పరామర్శించేందుకు నేడు ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత యశోద ఆసుపత్రికి వెళ్లారు. తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జ్వరం, మధుమేహ సమస్యలతో కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. గురువారం రాత్రి యశోద ఆస్పత్రి యాజమాన్యం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని, సోడియం లెవెల్స్ తగ్గాయని తెలిపింది. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో తెచ్చి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కేసీఆర్ ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు యశోద ఆస్పత్రికి తరలివస్తున్నారు.