Monday, October 20, 2025

ప్రజలకు ఆందోళన అవసరం లేదు – మంత్రి పొన్నం

Must Read

హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంద‌ని వెల్ల‌డించారు. అనుమానస్పద వ్యక్తులు, పరిస్థితులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. జై హింద్ .. ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో సాయుధ దళాలను చూసి గర్విస్తున్న‌ట్లు చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ , కంచన్ బాగ్, నానాల్ నగర్ లలో మాక్ డ్రిల్ జరిగిందని, కంటోన్మెంట్ ఏరియా కేంద్రంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్గత భద్రతకు సంబంధించి కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందన్నారు.పోలీస్ అధికారులు, స్టాఫ్​ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -