అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్లతో భేటీ అయ్యారు. ఏపీకి చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి ఎదిగారు. సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ గా పనిచేశారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లో లోతైన అవగాహన ఉన్న నాదేండ్ల.. 2014లో మైక్రోసాఫ్ట్ కు సీఈవో అయ్యారు. ఈ భేటీలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ లను ఏపీలో ఏర్పాఉ చేయాలన్నారు.అగ్రిటెక్ కు ఏఐని అనుసంధానించడం వల్ల మన రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తయారు చేయాలని భావిస్తున్నామని.. అందుకు మైక్రోసాఫ్ట్ సహాయం అవసరమన్నారు. డిజిటల్ గవర్నెన్స్ కు సాంకేతిక సాయం అందించాలని కోరారు. ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా నాదేండ్లను వేడుకున్నారు.