Monday, April 21, 2025

జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్

Must Read

జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగులు మావో యిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయి స్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సోమ‌వారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్‌ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ కోబ్రా, దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

పోప్ ఫ్రాన్సిస్ క‌న్నుమూత‌.. మోదీ దిగ్భ్రాంతి

పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల తీవ్ర బాధ కలిగింది. ఈ దుఃఖం, జ్ఞాపకార్థ ఘడియలో, ప్రపంచ కాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -