Thursday, November 14, 2024

రేవంత్ రెడ్డి కరప్ట్ సీఎం

Must Read

ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం భారీ అవినీతికి పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, బావమరుదులు అక్రమంగా కాంట్రాక్టులు దక్కించుకొని ప్రజాధనం కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బావమరిదికి చెందిన శోధా కంపనీ టర్నోవర్ రూ.3కోట్లు ఉంటే ఆ కంపెనీకి రూ.1137 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆధారాలతో సహా బయటపెట్టారు. రేవంత్ రెడ్డి ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నాడని స్వయంగా ప్రధాని మోడీ చెప్తున్నాడు కానీ, చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు. అమృత్‌ స్కీం టెండర్లలో రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రూ.వేల కోట్ల రూపాయల టెండర్లు కట్టబెట్టారని పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయాలు తీసుకునే మంత్రులకు కాంట్రాక్టులు కట్టబెడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశంలో శక్తిమంతులు వీళ్లే..!!

రాజకీయ రంగంలో దేశంలోని అత్యంత శక్తిమంతులను ఇండియా టుడే ప్రకటించింది. ఇందులో తొలిస్థానంలో ప్రధాని మోడీ, రెండో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలిచారు....
- Advertisement -

More Articles Like This

- Advertisement -