తమిళనాడు కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో మృతుడైన రమేశ్ భార్య సంఘవి, టీవీకే అధ్యక్షుడు విజయ్ పంపిన 20 లక్షల రూపాయల పరిహారాన్ని తిరిగి పంపేసింది. మృతుల కుటుంబాల ఖాతాల్లో ఈ నెల 18న జమ చేసిన మొత్తాన్ని తిప్పి పంపినట్లు సంఘవి తెలిపింది. విజయ్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ, తను నేరుగా వచ్చి ఓదార్చుకుంటానని, ముందు ఆర్థిక సహాయం తీసుకోవాలని సూచించినట్లు ఆమె చెప్పింది. అయితే, డబ్బు ముఖ్యం కాదని, విజయ్ పరామర్శ కోసం ఎదురుచూస్తున్నామని, తమ ఇష్టానికి విరుద్ధంగా జమ చేసిన మొత్తాన్ని తిరిగి పంపామని బాధితులు వివరించారు.

