తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షానికి భారీగా పంటనష్టం జరిగింది. వరికోతల సమయంలో వర్షాలు పడటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈదురు గాలులకు మొక్కజొన్న పంట నేలమట్టమైంది. పంట చేతికి అంది వచ్చే క్రమంలో ఇలా జరగడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. దీంతో అక్కడక్కడా ధాన్యం కుప్పలు పోసుకున్న రైతుల వడ్లు సైతం తడిచిపోయాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సందర్శన చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.