Tuesday, July 1, 2025

రేవంత్ రెడ్డికి విషం తప్ప విజన్ లేదు!!

Must Read

సీఎం రేవంత్ రెడ్డికి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. రేవంత్ కు పరిపాలన చేతకాక రాష్ట్రం దివాలా తీసిందని.. ఆదాయం కూడా పడిపోయిందన్నారు. రేవంత్ కు విజన్ లేక తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి అవినీతి గురించి కేటీఆర్ బయటపెడితే.. దానిని జీర్ణించుకోలేక కుటుంబసభ్యులపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో పత్తి రైతుల కోసం మంత్రులు కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ.. పత్తి మాత్రం కొనడం లేదని ఆరోపించారు. క్వింటాలుకు రూ.7521 మద్దతు ధర ప్రకటించారు కానీ రేటు మాత్రం రూ.5500 కంటే ఎక్కువ పెట్టడం లేదన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలకు కొబ్బరికాయలు కొట్టుడే తప్ప రాష్ట్రంలో వడ్లు కొనే దిక్కు లేదన్నారు. పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని కూడా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రేవంత్ కు దమ్ముంటే రాజకీయపరంగా, ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాలి కానీ ఇలా పోలీసులను వెనుక పెట్టుకొని కుటుంబసభ్యులను బయటకు లాగడం సరికాదన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -