ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలకు వచ్చే 3-6 ఏళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయనుంది. వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్ రైస్, అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అందించనుంది. అన్ని కూరలు, పప్పులో మునగ పొడిని వినియోగించనుంది. ఇక కోడిగుడ్లు, పాలు, బాలామృతం వంటివి యథావిధిగా కొనసాగనున్నాయి.