- చైనాలో షాంగ్జీ ప్రావిన్స్‌లో ఘటన
చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాలు వరదలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ నగల దుకాణం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వరద ఉధృతికి షాపులో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు నీటిలో కొట్టుకుపోయాయి. అంచనా ప్రకారం సుమారు రూ.12 కోట్ల విలువైన ఆభరణాలు మిస్సైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు వీధుల్లోకి వచ్చి బంగారం వెతికే ప్రయత్నం చేశారు. కొందరు వరద నీటిలో తడుముకుంటూ వెతికిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వరదలతో భారీ నష్టం సంభవించిన ఈ ఘటనపై చైనా అధికారులు దర్యాప్తు చేపట్టారు.