ఇటీవల అనారోగ్య సమస్యలతో యశోద ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి నేడు డిశ్చార్జి అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ గురువారం యశోద ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, సోడియం లెవెల్స్ తక్కువగా ఉండటం వంటి ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పరీక్షల అనంతరం కేసీఆర్‌కు రెండు రోజుల పాటు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.కేసీఆర్ ఆస్పత్రి నుంచి నేరుగా నందినగర్ నివాసానికి బయలుదేరారు.