మహా నగరం హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఏపీలో పలుచోట్ల భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్ మెంట్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది. అయితే, ఎక్కడా ప్రాణాపాయం జరగలేదు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేటలో.. తెలంగాణలోని ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భూమి కంపించింది. హైదరాబాద్ లోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ లో స్వల్పంగా భూకంపం వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.