కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారన్న పుకార్లు వ్యాపించాయి. దీనిపై స్పందించిన శివకుమార్, తాను క్రమశిక్షణ కలిగిన సైనికుడినని, రాజీనామా వార్తలు పుకార్లే అని తోసిపుచ్చారు. పునర్వ్యవస్థీకరణ సిద్ధరామయ్య నిర్ణయమని, హైకమాండ్ చర్చల తర్వాతే జరుగుతుందని అన్నారు. ఢిల్లీకి రాహుల్, ఖర్గేను 100 కార్యాలయాల శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయనని, 2028లో పార్టీని అధికారంలోకి తెస్తానని పేర్కొన్నారు.

