స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఘన్‌పూర్‌లో బుధవారం ఓ షాపు ప్రారంభోత్సవానికి కడియం శ్రీహరి వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులు అక్కడ బాణాసంచా కాల్చారు. దీంతో పక్కన షాపులో ఫ్లెక్సీలు, టెంట్‌కు మంటలు అంటుకొని చెలరేగాయి. అక్కడే ఉన్న సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పారు.