Tuesday, July 1, 2025

40 యాక్సిడెంట్ల‌కు కార‌ణ‌మైన అనుష్క‌!

Must Read

టాలీవుడ్ జేజ‌మ్మ అనుష్క 40 యాక్సిడెంట్ల‌కు కార‌ణ‌మైంది. ఈ మాట చెప్పింది ఎవ‌రో కాదు.. ఏకండా ఆమె సినిమా డైరెక్ట్ చేసిన క్రిష్‌. ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అస‌లు విష‌యం ఏంటంటే… అల్లు అర్జున్, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘వేదం’ సినిమా విడుదలై ఇటీవ‌ల‌ 15 ఏళ్లు పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ క్రిష్ వేదం సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నాడు. హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్‌లో ‘వేదం’ సినిమాలో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న పోస్టర్‌ను అప్ప‌ట్లో హోర్డింగ్‌గా పెట్టార‌ట‌. దీంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు అనుష్క పోస్టర్‌ చూస్తూ రోడ్ యాక్సిడెంట్లు చేశార‌ట‌. ఇలా అనుష్క పోస్టర్ చూస్తూ ఏకంగా 40 యాక్సిడెంట్స్ అయ్యాయని క్రిష్ తెలిపారు. ఇక ట్రాఫిక్ పోలీసులు త‌న‌కు విష‌యం చెప్ప‌డంతో హోర్డింగ్ తొల‌గించిన‌ట్లు వెల్లడించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -