గుజరాత్‌లోని వడోదరలో పురాతన వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 16కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. కూలిన వంతెన పనికి రాదని ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2021లోనే వంతెన స్థితి అధ్వానంగా మారిందని, వాహనాలను అనుమతించవద్దని హెచ్చరించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు నష్ట పరిహారాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో సహాయక బృందాలు 14 మందిని రక్షించగా, వారిలో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.