తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ప్రభుత్వానికి తెలిపినా స్పందన లేదని సమ్మె చేపట్టారు. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు ఆగాయి. ఇదే సమయంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన యువరైతు సంతోష్ (30) వర్షాలతో పంట నష్టం కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 10 ఎకరాల్లో పత్తి సాగు చేసిన ఆయన బెల్లంపల్లి ఆసుపత్రిలో మృతి చెందారు.

