Tuesday, October 21, 2025

చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Must Read

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేతలకు, నేత కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మానవ నాగరికత పురోగతిలో చేనేతకు ప్రత్యేక స్థానం ఉందని, ఈ రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత కార్మిక కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఇప్పటికే పాత బకాయిలను విడుదల చేయడంతోపాటు, రూ. లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. అలాగే నేత కార్మికుల సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం “తెలంగాణ చేనేత అభయ హస్తం పథకం”, “తెలంగాణ నేతన్న పొదుపు”, “నేతన్న బీమా”, “తెలంగాణ నేతన్నకు భరోసా” వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. ఇవన్నీ చేనేత రంగ పునరుజ్జీవానికి ఎంతో బలాన్నిస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -