Wednesday, July 2, 2025

నేడు హైడ్రా పోలీస్ స్టేష‌న్ ప్రారంభం

Must Read

హైద‌రాబాద్‌లో భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను అరిక‌ట్టేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా హైడ్రాను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అమలులోకి తీసుకురావడానికి నిర్ణయించారు. దీనిని నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించ‌నున్నారు. హైదరాబాద్ నగరంలోని బుద్ధభవన్ పక్కనే నిర్మించిన ఈ హైడ్రా పోలీస్ స్టేషన్‌ను జీ ప్లస్ 2 అంతస్తులతో ఏర్పాటు చేశారు. హైడ్రా పోలీస్ స్టేషన్‌కు ఏసీపీ తిరుమల్ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందులో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -