Friday, August 29, 2025

వరదలపై సీఎం ఏరియల్ సర్వే

Must Read

తెలంగాణలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ప్రభావంపై ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం పోచారం ప్రాజెక్టు, పరివాహక ప్రాంతంతో పాటు కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను కూడా హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ కామారెడ్డిలో ల్యాండ్ కాలేకపోయింది. దాంతో నేరుగా మెదక్ జిల్లా వరద ప్రాంతాలను పరిశీలించిన సీఎం, జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిపై సమీక్ష జరిపారు. వరద నష్టం నివేదికలు వెంటనే సిద్ధం చేయాలని, సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డిలో వరదలతో నష్టపోయిన ప్రాంతాలను మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులతో సమావేశమై సహాయక చర్యలపై సమీక్ష చేపట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -