తెలంగాణ సాహిత్యానికి వన్నె తెచ్చిన మహాకవి, సారస్వత శిఖరం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి.నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గేయ రచయితగా, నవలాకారుడిగా, పద్యకవిగా సాహిత్య రంగానికి ఆచార్య సి.నారాయణ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన అందించిన సేవలు విశిష్టమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహాకవి సి.నారాయణ రెడ్డి సాహిత్య సంపద తరతరాలకి ప్రేరణగా నిలుస్తుందని సీఎం అన్నారు.