Wednesday, November 19, 2025

రాయలసీమపై చంద్రబాబు నిర్లక్ష్యం: శైలజానాథ్

Must Read

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్, రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యం చూపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాయలసీమకు చెందాల్సిన రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్‌లను తరలించారని, నీటి వనరులు, నిధులను కోల్పోయామని ఆరోపించారు. శ్రీబాగ్ ఒప్పందం జరిగి 87 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మార్పు లేదని, వైఎస్ జగన్ తాగు-సాగు నీటి ప్రాజెక్టులు తెచ్చారని కొనియాడారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి పనులను చంద్రబాబు ఆపేశారని, పోలవరం ఎత్తు తగ్గించడం ద్వారా అన్యాయం జరిగిందని విమర్శించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి, జగన్ ప్రాజెక్టులను కొనసాగించాలి, సిద్దేశ్వర అలుగు నిర్మాణం చేపట్టాలి, నీళ్లు-నిధుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -