Friday, December 27, 2024

తిరుపతికి బాంబు బెదిరింపు!

Must Read

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని పలు హోటల్స్ లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. పోలీసులు అప్రమత్తమై హోటళ్లను చెక్ చేశారు. లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటల్స్, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఈ–మెయిల్‌లో బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాది​క్ కు ఇటీవల జైలు శిక్ష ఖరారు చేయగా.. సదరు మెయిల్ లో ఆ అజ్ఞాత వ్యక్తి ఆక్రోశం వెళ్ళగక్కారు. శిక్ష పడేందుకు తమిళ సర్కార్ తరఫున సీఎం స్టాలిన్ సహకారం అందించడం తమకు నచ్చలేదంటూ టెర్రరిస్ట్ ఈ–మెయిల్ పంపాడు. రాష్ట్రంలోని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్‌ఐ పూనుకుందని, తిరుపతిలోనూ పలు హోటళ్లను పేల్చేస్తామని తెలిపాడు. దీంతో పోలీసులు హైఅలెర్ట్ అయ్యారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రేవతి మరణించినట్లు నాకు చెప్పలేదు

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -