Monday, January 26, 2026

జై శ్రీరాం స‌రిపోదు.. స‌మాజ సేవ చేయండి – కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి

Must Read

ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి సొంత పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నాయ‌కుల‌కు , కార్య‌క‌ర్త‌ల‌కు దేశ భక్తి, దైవ భక్తి ఉంటే సరిపోద‌ని, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటే సరిపోద‌ని, సమాజ సేవ చేయాల‌ని వ్యాఖ్యానించారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే బీజేపీ పార్టీ ఎలా బలపడుతుంద‌ని ప్ర‌శ్నించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా, కార్యకర్తలతో ఆయ‌న మాట్లాడారు. మీకు దేశ భక్తి, దైవ భక్తి ఉంటే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ లో చేరండి, బీజేపీ లాంటి రాజకీయ పార్టీలో ఉండే అర్హత మీకు లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజకీయ పార్టీ కాదని, దేశభక్తి పేరుతో వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు పార్టీని బలహీనం చేస్తున్నారని పేర్కొన్నారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే పార్టీ ఎలా బలపడుతుందని కార్యకర్తలను ప్రశ్నించారు. పైన మోడీ ఇక్కడ నేను ఎలాగు గెలుస్తామని, అధ్యక్ష్య పదవుల కోసం కొట్టుకోవడం కాకుండా పార్టీని బలోపేతం చేయడానికి పని చేయాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -