Friday, October 31, 2025

స్కూల్ బాత్‌రూముల్లో కెమెరాల క‌ల‌క‌లం!

Must Read

కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అసభ్యకర ప్రవర్తన బయటపడింది. అటెండర్ యాకుబ్ పాషా తాకడం బాత్ రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీయడం ఏడాదిగా చేస్తున్నాడు. జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సఖి కౌన్సిలింగ్ ద్వారా కలెక్టర్ దారుణాలు తెలుసుకున్నారు. పోక్సో కేసు కావడంతో రహస్య విచారణ చేపట్టారు. చిన్నారులపై ఏడాది లైంగిక వేధింపులు చేసినట్టు నిర్ధారణ అయింది. సెప్టెంబర్ లో హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు వచ్చింది. హెడ్ మాస్టర్ నిందితుడిని వెనుకేసుకున్నాడు. విషయం బయటకు చెప్పొద్దని సిబ్బందిని బెదిరించాడు. స్కూల్లో ఉరేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. సిబ్బంది భయపడి వెనక్కు తగ్గింది. మరో ఇద్దరు సిబ్బందిపై అనుమానాలు ఉన్నాయి. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఆక్రుత్యాలు వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీరియస్ అయ్యారు. కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారుల వివరాలు గోప్యంగా ఉంచాలని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి: వైయ‌స్ జగన్

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత...
- Advertisement -

More Articles Like This

- Advertisement -