ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించింది. ఈమేరకు షెడ్యూల్ ను ప్రభుత్వానికి పంపింది. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు కూడా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీలు ఖరారు అవుతాయి.